← Back to news

దుర్గమ్మ ఫొటోతో బిర్యానీ యాడ్.. బెంగాల్‌లో రచ్చ!

By Nani Eluri· 2h ago· Thehindu
దుర్గమ్మ ఫొటోతో బిర్యానీ యాడ్.. బెంగాల్‌లో రచ్చ!

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఓ బిర్యానీ షాప్ పోస్టర్ వివాదంగా మారింది. దుర్గమ్మ ఫొటో పక్కనే బిర్యానీ ప్లేట్ పెట్టడంతో కొందరు అభ్యంతరం చెప్పారు. ఈ పోస్టర్‌ను తీసేయాలని బీజేపీ ఎమ్మెల్యే దీపాంజన్ చక్రవర్తి డిమాండ్ చేశారు. దీంతో షాప్ ఓనర్ పోస్టర్లను తొలగించి, పోలీసులకు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పారు. లిక్కర్ షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం, బిర్యానీ యాడ్ విషయంలోనే ఎందుకంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

More in National