← Back to news

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

By Damidi Chandra Reddy· 9h ago· Husnabad, Husnabad, Siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బుధవారం పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బిలిశెట్టి శివయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Local