వైజాగ్ డేటా సెంటర్.. కోర్టు ఏం చెప్పిందంటే!

వైజాగ్‌లో గూగుల్–అదానీ నిర్మిస్తున్న డేటా సెంటర్ పనులు కొనసాగించేందుకు ఏపీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే అడవివరం, ముడసర్లోవలోని 160 ఎకరాల దేవాదాయ భూములను ప్రాజెక్ట్ కోసం కేటాయించడంపై PIL పైల్ అయింది. దీనిపై చివరి తీర్పు వచ్చే వరకు డెవలపర్ తన సొంత రిస్క్‌తోనే పనులు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. చివరి తీర్పు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా వస్తే డెవలపర్‌కు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని తెలిపింది.


