మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు YSRCP

AP: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో హింస జరిగిందని, తమ క్యాండిడేట్లను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 18తో ముగిసిన నామినేషన్ల గడువును పొడిగించాలని, బెదిరింపులు, హింస కారణంగా నామినేషన్ వేయలేకపోయిన వాళ్లకు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని YSRCP కోరింది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీస్ రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.



