← Back to news

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ సమ్మె..!

By Jagadish· 2d ago
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ సమ్మె..!

శంషాబాద్ RGAI ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో 25 వేల మంది డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఓలా, ఉబెర్, రాపిడో ఎయిర్‌పోర్ట్ రైడ్స్‌ను డ్రైవర్లు బహిష్కరించారు. 2022 dec 9న జారీ చేసిన GO 46 అమలు చేయాలని దీని ప్రకారం కిలోమీటరుకు రూ.21 ఛార్జీ ఇవ్వాలి. కానీ ప్రస్తుతం రూ.12 నుంచి రూ.15 మాత్రమే అందుతోందని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. చట్టబద్ధమైన ఛార్జీలు, వృత్తిపరమైన గౌరవం కావాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

More in Politics