← Back to news

రోడ్డు అధ్వానం.. మొత్తం గుంతలమయం

By gani gani· 9h ago· Gokavaram, Gokavaram, East Godavari
రోడ్డు అధ్వానం.. మొత్తం గుంతలమయం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కొత్తపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా మలుపు వద్ద గుంతలు ఉండటంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనదారులే గుంత వద్ద హెచ్చరికగా టైర్‌ను ఏర్పాటు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

More in Local