← Back to news

క్రికెట్‌లో తెలుగమ్మాయి సరికొత్త రికార్డు

By Sharmila· 3h ago
క్రికెట్‌లో తెలుగమ్మాయి సరికొత్త రికార్డు

AP: YSR కడప జిల్లాకు చెందిన క్రికెటర్ శ్రీచరణి అరుదైన ఘనత సాధించారు. ఐసీసీ మహిళల అండర్‌-20 టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 804 రేటింగ్ పాయింట్లతో నంబర్‌ వన్‌గా నిలిచారు. భారత మహిళా క్రికెట్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన యువబౌలర్‌గా రికార్డు సాధించారు. గతంలో మిథాలీ రాజ్ సాధించిన 780 పాయింట్ల మార్క్‌ను శ్రీచరణి క్రాస్ చేసింది. ఇంటర్నేషనల్ అండర్‌-20 టీ20లో ఎక్కువ రేటింగ్‌ 806 పాయింట్లుగా ఉండగా, శ్రీచరణి కేవలం 2 పాయింట్ల దూరంలో ఉంది.

More in Sports