పాక్‌కు ఐసీసీ డబుల్ షాక్..!

పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది. అంతేకాకుండా ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 11 పాయింట్లు కోత విధించారు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ 9వ స్థానంలో పడిపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టుపై ఈ జరిమానా విధించడంతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు నిరాశకు గురయ్యారు.



