పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దసరా సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు పంపిణీ చేసేందుకు యువనేత, కాంట్రాక్టర్ KK కృష్ణ సహకరించారు. షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ కార్మికులకు దుస్తులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆశయాలకు అనుగుణంగా కేకే కృష్ణ ఈ కార్యక్రమానికి సహకరించారు. పండుగ వేళ కొత్త బట్టలు అందుకోవడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.




