టారిఫ్ల కంటే సేవల విస్తరణపైనే జియో దృష్టి

మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయం పెంచుకోవడానికి జియో మరిన్ని డిజిటల్ సేవలను అందించడంపై దృష్టి పెట్టిందని సంస్థ అధినేత ఆకాశ్ అంబానీ చెప్పారు. బ్రాడ్బ్యాండ్, వ్యాపార సంస్థలకు అందించే సేవలను విస్తరించడంతో పాటు 10 కోట్ల ఇళ్లకు ఇంటర్నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 6జీ టెక్నాలజీ అభివృద్ధిపైనా దృష్టి పెట్టామని చెప్పారు. జియో పబ్లిక్ ఇష్యూకు ముందు జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు.


