← Back to news

అదరహో.. ఆదిత్య L1

By Lokesh· 23h ago· Gov
అదరహో.. ఆదిత్య L1

సూర్యుడి నుంచి వెలువడే భారీ విస్ఫోటనాలపై భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్1, యూరప్‌కు చెందిన ప్రోబా-3 శాటిలైట్స్ కలిసి కీలక రీసెర్చ్ చేశాయి. బెంగళూరు శాస్త్రవేత్తలు ఈ రెండు శాటిలైట్స్ ల సమాచారంతో సూర్యుడి నుంచి వెలువడే వేడి వాయువులు, వాటి సాంద్రత, శక్తిని విశ్లేషించారు. 2025 సెప్టెంబర్‌లో నమోదైన రెండు విస్ఫోటనాల్లో ఒకటి సెకనుకు 645KM వేగంతో, మరొకటి 145KM వేగంతో కదిలినట్లు గుర్తించారు. ఈ పరిశోధనతో భూమిపై ప్రభావం చూపగల సౌర విస్ఫోటనాలను మరింతగా అర్థం చేసుకోవచ్చు.

More in Technology