← Back to news

డెలివరీ బాయ్ వివాదంపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో వీడియో!

By sahani· 30 Jun 2026· Instagram· Hyderabad
డెలివరీ బాయ్ వివాదంపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో వీడియో!

డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవపై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చారు. అడ్రస్ మారి పక్కింటి పార్సిల్ తన ఇంటికి వచ్చిందని, దాన్ని తన అమ్మ ఓపెన్ చేసిందని చెప్పారు. అయితే ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చి వాళ్ళ అమ్మను ‘ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని తిట్టడంతోనే తనకు కోపం వచ్చిందన్నారు. ఎదురింటి వాళ్లు తప్పుడు అడ్రస్ పెట్టడం వల్లే ఈ కన్ఫ్యూజన్ జరిగిందని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ తప్పు అని చెప్తూ అఖిల్ క్లారిటీ ఇచ్చారు.

More in News