హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

TG: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రిజర్వేషన్లపై అభ్యంతరకరంగా పుస్తకం రాశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్సైకి ఫిర్యాదు అందజేశారు. అంబేద్కర్‌పై ‘కల్పిత నాయకుడు’ అనే పుస్తకం రాయడాన్ని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుస్తకం విడుదల చేయడాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ద్వారానే తమకు హక్కులు, రిజర్వేషన్ ఫలాలు లభించాయని తెలిపారు.