← Back to news

కోటి ఆదినారాయణ మృతి.. మాజీ ఎంపీ సంతాపం

By Ramesh Kondru· 1d ago· Madhira (Ct), Madhira, Khammam
కోటి ఆదినారాయణ మృతి.. మాజీ ఎంపీ సంతాపం

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన BRS యువజన నాయకుడు తాళ్లూరి హరీష్ బాబు తాత కోటి ఆదినారాయణ మృతి పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదినారాయణ మృతి విషయం తెలుసుకున్న ఆయన ఫోన్‌లో హరీష్ బాబుతో పాటు ఆదినారాయణ కుమారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మృతిపై నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

More in Local