← Back to news

ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు

By KONTU SAGAR· 21 Aug 2026
ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు

TG: ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ఆటో కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాల్ల హరీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంద్‌కు మద్దతుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

More in Local