డేటా సెంటర్.. వాకింగ్ మ్యాటర్

అమెరికాలోని వర్జీనియాలో 10 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్‌లో జేమ్స్ వాడీ లీడ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రోజూ 30 వేల స్టెప్పులు వేస్తూ పరికరాలు వేడెక్కుతున్నాయా? పైపులు పగిలాయా? లైట్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? అని ఆయన చెక్ చేస్తారు. హాల్స్ ఎంత పొడవుగా ఉంటాయంటే కొందరు టెక్నీషియన్లు అక్కడ స్కూటర్లపైనే తిరుగుతారు! AI విస్తరణతో ఇలాంటి డేటా సెంటర్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది.


