దసరా సెలవులు వచ్చేశాయ్..

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు ఈ నెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు 21 వరకు సెలవులు ఉంటాయి. ఏపీలో విద్యాసంస్థలకు అక్టోబర్ 21 వరకు సెలవులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం సెలవులు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా.. రెండో శనివారం, ఆదివారం రావడంతో రెండు రోజుల ముందే మొదలవుతున్నాయి. దీంతో సెలవులు ముందుగానే రావడంతో పిల్లలు ఆటపాటలతో దసరా పండుగను ఎంజాయ్ చేయనున్నారు.



