తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ కీలక డిమాండ్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలోతో పాటు తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకునేలా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.