పిడుగుపాటుకు ఎద్దు మృతి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు బండారి రాయమల్లుకు చెందిన ఎద్దు పొలం వద్ద మేత మేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.70 వేలకు పైగా ఉంటుందని రైతు కన్నీటి పర్యంతమయ్యారు. పిడుగుపాటుతో పశువును కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రాయమల్లు ఆవేదన వ్యక్తం చేశారు.


