← Back to news

డ్యూటీకి వెళ్లిన మహిళ.. చెట్ల పొదల్లో శవమై తేలింది!

By Adithya· 19h ago· Ranga Reddy
డ్యూటీకి వెళ్లిన మహిళ.. చెట్ల పొదల్లో శవమై తేలింది!

షాద్‌నగర్‌లో పనిచేసే 40 ఏళ్ల మంగమ్మ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్లకు చెందిన ఆమె, ఈ నెల 22న డ్యూటీకి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు షాద్‌నగర్ PSలో కంప్లైంట్ చేశారు. అయితే, ఇవాళ నందిగామ మండలంలో చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. చావుకు గల అసలు కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local