← Back to news

కాలువలు లేక రోడ్లపైనే డ్రైనేజీ నీరు

By DK· 9h ago
కాలువలు లేక రోడ్లపైనే డ్రైనేజీ నీరు

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎస్సీ కాలనీలో మురుగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డు నిర్మించినా కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్ల చుట్టూ, రోడ్లపై డ్రైనేజీ నీరు నిలిచిపోతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ప్రాంతం కుంటను తలపిస్తోందని, దుర్గంధంతో పాటు దోమల బెడద పెరుగుతోందని చెబుతున్నారు. గతంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి కాలువలు నిర్మించాలని అధికారులకు సూచించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.

More in Local