విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
అమెరికాలోని నార్తర్న్ కెంటకీ ఎయిర్‌పోర్ట్‌లో కలిట్టా ఎయిర్ విమానం ల్యాండింగ్ చేస్తున్న టైంలో వెనుక భాగం రన్‌వేను బలంగా తాకింది. దీంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లి చుట్టూ తిప్పారు. ఆ తర్వాత రన్‌వేపై సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



