తిలకం వద్దన్న Farah Khan.. నెట్టింట చర్చ
ప్రముఖ ఫిల్మ్మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఓ కార్యక్రమంలో నుదుటిపై తిలకం పెట్టించుకునేందుకు నిరాకరించి, చేతిపై పెట్టాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, తిలకం పెట్టుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని మరికొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీరేమంటారు? Farah Khan నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
