← Back to news

వైరల్‌ ఫీవర్‌తో పాటు డెంగీ, మలేరియా టెన్షన్‌!

By A.Ajay· 4h ago
వైరల్‌ ఫీవర్‌తో పాటు డెంగీ, మలేరియా టెన్షన్‌!

TG: తెలంగాణలో వైరల్‌ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌ జిల్లాల్లో వైరల్‌ ఫీవర్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 6,238 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కేసులు తక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా, డెంగీ, మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

More in TG