రీల్స్‌కు బ్రేక్.. మెదడుకు బూస్ట్!

మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు రీల్స్, షార్ట్స్, నోటిఫికేషన్లతో బిజీగా ఉంటున్నారా? అయితే డైలీ మినిమం 20 మినిట్స్ బుక్ చదివే అలవాటు చేసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. రీడింగ్ బ్రెయిన్‌కి ఎక్సర్‌సైజ్‌లా పనిచేసి కాన్సన్‌ట్రేషన్, మెమరీ పవర్, వొకాబులరీని మెరుగుపరుస్తుందట. ప్రెషర్‌ని తగ్గించడంతో పాటూ వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరపు ముప్పును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.



