← Back to news

గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుల పుట్టినరోజా?

By siva· 5d ago
గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుల పుట్టినరోజా?

AP: పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు, వైఎస్ఆర్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినట్టు సమాచారం. కొంతమంది టీచర్ల సహకారంతోనే ఈ వేడుకలు జరిగాయని, వాళ్ల మీద ఎంఈవో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూల్స్‌కి వ్యతిరేకంగా గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుడి పుట్టినరోజు జరపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్కూళ్లను రాజకీయ నేతల ప్రచార వేదికలుగా మార్చడం ఏమిటని జనం మండిపడుతున్నారు.

More in Local