కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


