← Back to news

వాటర్ వార్.. రైతుల కొట్లాట

By Prashanth· 6h ago

TG: El Nino ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతుల మధ్య నీటి పంపిణీ వివాదం ఘర్షణకు దారితీసింది. జూరాల ప్రాజెక్టు నుంచి భీమా కాల్వ ద్వారా వచ్చే నీటి కోసం ఇరువర్గాల రైతులు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నా ఘర్షణ కొనసాగింది. సాగునీటి కొరతతో రైతుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

More in TG