తిరుపతిలో కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు

ఏపీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాయలసీమ జిల్లాల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని సదస్సు తీర్మానించింది. ప్రభుత్వంతో తేల్చుకునే సమయం వచ్చిందని నాయకులు తెలిపారు.




