వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోరా సారూ

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో బోరుబావి నీరు వృథాగా పోతోంది. పైప్ లీకేజీ కావడంతో నీరు బయటకు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులతో తాగునీటి ఇబ్బందులు ఉన్న సమయంలో నీరు వృథాగా పోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.


