← Back to news

పల్లె ప్రకృతి వనం పాడు.. గేట్లు ధ్వంసం!

By Kendyala Balaraju· 1d ago· Yenugonda (Ct), Mahabubnagar Urban, Mahabubnagar
పల్లె ప్రకృతి వనం పాడు.. గేట్లు ధ్వంసం!

వనపర్తి జిల్లా, ఖిలా ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్లక్ష్యానికి గురైంది. ప్రధాన ఇనుప గేట్లు ధ్వంసమై నెలల తరబడి నేలపాలయ్యాయి. దీంతో పశువులు, మేకలు వనంలోకి చొరబడి విలువైన మొక్కలను నాశనం చేస్తున్నాయి. పంచాయతీ అధికారులు, కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన సిబ్బంది విధి నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

More in Local