"విషం ఇవ్వండి".. కోర్టులో నటి కన్నీళ్ళు

రేణుకాస్వామి మర్డర్ కేసులో జైల్లో ఉన్న కన్నడ నటి పవిత్రా గౌడ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నారు. జైల్లో కొందరు మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నారని జడ్జ్‌కి తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలనీ, లేదంటే చనిపోయేందుకు విషం ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె తరపు లాయర్లు చెప్పారు. అయితే భద్రత కోసం ఆమెను ఇప్పటికే మరో జైల్‌కి మార్చినట్లు జైలు అధికారులు తెలిపారు.


