'జడల్' లుక్ వెనుక ఉన్న సీక్రెట్

'ది ప్యారడైజ్' సినిమాలో నాని 'జడల్' క్యారెక్టర్ లుక్ తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచే వచ్చిందని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పారు. చిన్నప్పుడు తన తల్లి జుట్టు పెంచి జడలు వేసేదని, యాక్టర్స్ 70mm స్క్రీన్ మీద జడలతో కనిపిస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకునే వాడినని తెలిపారు. ఇప్పుడు నాని అన్నను ఆ లుక్‌లో చూపించి తన కలను నిజం చేసుకున్నానని, కొన్ని గంటల్లో సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోందని డైరెక్టర్ తన 'X' లో పోస్ట్ చేశారు.



