← Back to news

జాతర క్యాష్ మాయం.. రూ.4 లక్షలు!

By GOLLAPALLI SUDHAKAR RAO· 2h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
జాతర క్యాష్ మాయం.. రూ.4 లక్షలు!

విజయవాడకు చెందిన వ్యాపార దంపతులు నాగమణి, శ్రీనివాసరావు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పది రోజులు ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మారు. సంపాదించిన రూ.4 లక్షలకు పైగా నగదుతో ఈ నెల 8న ట్రక్ ఆటోలో విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం వెంకటాచలం పరిధిలో భోజనం కోసం ఆటో ఆపారు. ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి నగదు మాయం. చిల్లర మాత్రం ఉంది. పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదుపై స్పష్టత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

జాతర క్యాష్ మాయం.. రూ.4 లక్షలు!

More in Local