అల్లూరికి ముందే బ్రిటీషర్లను ఎదిరించిన వీరుడు

మన్యం పోరాటంలో అల్లూరి కంటే 42 ఏళ్ల ముందే గెరిల్లా వార్‌తో బ్రిటీషర్లను ఎదురించిన మన్యం వీరుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు. ఇవాళ ఆయన జయంతి. 1853 సెప్టెంబర్ 10న విజయనగరం జిల్లా బొబ్బిలిలో జన్మించారు. జమీందార్లు, బ్రిటీష్ పాలకుల పన్నుల దోపిడీపై తిరగబడి 1879లో 'రంప పితూరీ'ని నడిపించారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు లాక్కోవడం, సంపన్నుల ధాన్యాన్ని పేదలకు పంచడం చేశారు. బ్రిటీషర్లు ఇచ్చిన పదవుల ఆఫర్లను కాలదన్నిన ఆయనను 1880లో సొంత అనుచరుడి నమ్మకద్రోహంతో బ్రిటీష్ బలగాలు కాల్చి చంపాయి.


