పాకిస్థాన్‌లో గణేశ శోభ!

వినాయక చవితి అంటే.. ఇండియాలోనే కాదు.. పాకిస్థాన్ లాంటి దేశంలోనూ పండగే. కరాచీలోని.. గణేశ్ మఠ్ మందిరంలో ఓ ముస్లిం ఆర్టిస్ట్ గణేశ్ విగ్రహాన్ని తయారుచేశారు. మహారాష్ట్ర కుటుంబం నిర్వహిస్తున్న ఆ ఆలయం కోసం.. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రతిమను రూపొందించారు. భక్తి, కళకు మత భేదాలు అడ్డుకావని చాటుతూ రూపొందించిన ఈ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతాలతో సంబంధం లేకుండా అందరూ వినాయకచవితిని ఆనందంగా జరుపుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.


