సీఎం రేవంత్ రెడ్డికి KTR బహిరంగ లేఖ

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల భారీ స్కాంకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘భోత్రా లాజిస్టిక్స్’ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే సీఎం చీకటి ఒప్పందం చేసుకున్నారని, కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించారని అన్నారు. భోత్రా లాజిస్టిక్స్తో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.





