← Back to news

కరెంట్‌ కోసం రోడ్డెక్కిన రైతులు

By A.Ajay· 2h ago

నల్గొండ జిల్లా గండ్లపల్లి మండలం సింగరాజుపల్లి సబ్‌స్టేషన్‌ వద్ద సమీప గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ–దేవరకొండ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పంటలను కాపాడేందుకు కరెంట్‌ సరఫరా సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

More in TG