వర్షంలోనూ పింఛన్ల పరిశీలన.. MPDO సైతం!

ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండల కేంద్రంలో బుధవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కానీ చేయూత పింఛన్ల నూతన దరఖాస్తుల పరిశీలన ఆగలేదు. MPDO భూక్యా రంజిత్ కుమార్ వర్షాన్ని లెక్కచేయకుండా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలించారు. సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ కూడా ఉన్నారు. అర్హులు, అనర్హుల వివరాలను అధికారిక పోర్టల్‌లో నమోదు చేశారు. భారీ వర్షంలోనూ సేవ చేయడం అభినందనీయం.




