చైనా కంటే ఎంతో ముందంజ!

ప్రపంచంలోనే అత్యధిక చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఉన్న దేశాల జాబితాలో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. 2026 ఎఫ్‌ఐడీఈ (FIDE) డేటా ప్రకారం.. 85 కంటే ఎక్కువ గ్రాండ్‌మాస్టర్లతో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో 250 మందికి పైగా గ్రాండ్‌మాస్టర్లతో రష్యా టాప్‌లో ఉండగా.. జర్మనీ (100+), యునైటెడ్ స్టేట్స్ (95+), ఉక్రెయిన్ (90+) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా 40కి పైగా గ్రాండ్‌మాస్టర్లతో 10వ స్థానానికి పరిమితమైంది.



