‘మళ్లీ వస్తారా టీచర్’.. విద్యార్థుల ఆవేదన వైరల్
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా మంజు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నరేంద్ర ఖన్నా బదిలీ అయ్యారు. దీంతో ఆయనను వీడలేక విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్న ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు, 'నేను మళ్ళీ వస్తాను బిడ్డా' అంటూ విద్యార్దులను హత్తుకున్నారు. గ్రామస్థులు, విద్యార్థులు చూపిన ప్రేమను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. టీచర్ అంటే ఇలా ఉండాలి అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
