జర్నలిస్టుల కోసం పోరాడేది మేమే: అల్లం నారాయణ!

మహబూబ్ నగర్ జిల్లాలో TJUWJ H143 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడారు. జర్నలిస్టుల పక్షాన పోరాటం చేసేది ఈ యూనియన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నాటి CM కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లు కేటాయించారని, కరోనా సమయంలో 3,900 మందికి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల్లో ఇంత గందరగోళం ఎప్పుడూ లేదన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా వరంగల్ శివకుమార్, చింతకాయల వెంకటేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
