నేత సంఘాల సమస్యలు పరిష్కరించాలని మంత్రి వినతి

పాలకొల్లులో చేనేత సహకార సంఘాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి కార్యాలయం వద్ద మంత్రిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘ జిల్లా కార్యదర్శి బూడిద జోగేశ్వరరావు మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి, APCOకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలకమండలిని ఏర్పాటు చేయాలని కోరారు.


