కూరగాయల మార్కెట్తో రాకపోకలకు ఆటంకం

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు చేపడుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై మార్కెట్ నిర్వహణతో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కూరగాయల వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.



