మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

మహిళలను ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ చేయడమే గవర్నమెంట్ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చలపర్తి గ్రామంలో ₹10 లక్షల ఫండ్స్‌తో నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూరల్ విమెన్ గ్రూప్స్‌కి బెటర్ ఫెసిలిటీస్ అందించడం ద్వారా వారి యాక్టివిటీస్‌కి మంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పారు. మహిళలంతా ఒకటై ముందుకు సాగుతూ ఆర్థికంగా ఎదగాలని కోరారు.



