← Back to news

పేద విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు

By DK· 14h ago
పేద విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 23 మంది పేద విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేశారు. కళాశాలలో కొంతమంది విద్యార్థులకు యూనిఫాంలు లేవని తెలుసుకున్న దాతలు పాండవ శేఖర్, బెందాళం శ్రీకాంత్ రూ.11,500 విలువైన యూనిఫాంలను అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో త్రినాథ్, ఏవో శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ సింహాచలం నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్ పాల్గొన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలిచిన దాతలను అధికారులు అభినందించారు.

More in Local