← Back to news

కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

By Yadav· 22h ago· Mahabubabad
కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. తెలంగాణ బీసీ వెల్ఫేర్ కమిషనర్ సూచనల మేరకు, కలెక్టర్ అనుమతితో జిల్లా రెవెన్యూ అధికారి టీఏవీ నాగలక్ష్మి, బాపూజీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ కోసం బాపూజీ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

More in Local