← Back to news

పద్మారావునగర్ పార్కులో హార్ట్ హెల్త్ క్యాంప్

By E. Chandrashekhar· 1d ago· Padmarao Nagar, Secunderabad, Hyderabad
పద్మారావునగర్ పార్కులో హార్ట్ హెల్త్ క్యాంప్

మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్కులో ఆదివారం నిర్వహించిన ఉచిత హార్ట్ హెల్త్ క్యాంప్‌లో ఆయన మాట్లాడారు. పద్మారావు పార్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి బాల్ రెడ్డితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వాకర్స్, సందర్శకులు పాల్గొని గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

More in Local