← Back to news

వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చోరీ..!

By Jagadish· 1h ago
వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చోరీ..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీడీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ గోడే దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని విరాళాలు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. వాటి విలువ రూ.2 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఆలయం వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. స్థానికులు అందించిన సమాచారంతో పట్టణ సీఐ హరినాథ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More in Local