పేదింటి పెళ్లికి 9 వేలు సాయం!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లగడంబల బస్తీలో మహమ్మద్ తాజ్ దంపతులు ఉంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన తాజ్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముగ్గురు పిల్లలు. కూతురి పెళ్లి ఫిక్స్ అయింది. ఖర్చులు చూసి ఆయన టెన్షన్ పడుతున్నారు. విషయం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి తెలిసింది. వాళ్లు బిర్లా ఓపస్ TSM దాడి రాజును కలిశారు. ఆయన కూతురు రియాన్షిక బర్త్‌డే సందర్భంగా ఆ కుటుంబానికి సాయం చేయాలనుకున్నారు. 9,000 రూపాయల క్యాష్, 5 కిలోల నూనె అందజేశారు.


